Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ హ్యాండ్‌బాల్ అధ్యక్షుడు జగన్
న్యూఢిల్లీ : దేశ క్రీడా రంగం అభివృద్ది చెందాలంటే, ముందుగా క్రీడా సంఘాలు మరింత బలోపేతం కావాల్సిన ఆవశ్యకత ఉందని జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు జగన్మోహన్ రావు అన్నారు. 'టోక్యో ఒలింపిక్స్‌లో మన క్రీడాకారులు అద్భుత పోరాట స్ఫూర్తిని కనబరిచారు. ఒలింపిక్స్‌లో అథ్లెట్ల విజయాల వెనుక క్రీడా సంఘాల శ్రమ ఎంతో ఉంది. టోక్యోలో పతకాలు సాధించిన క్రీడా సంఘాల స్ఫూర్తితో మరిన్ని క్రీడా సంఘాలు పారిస్ ఒలింపిక్స్‌లో పతకాల కోసం ఇప్పటి నుంచే కృషి చేయాలి. క్రీడా రంగ అభివృద్దికి క్రీడా సంఘాల బలోపేతం అవసరం. ఈ దిశగా భారత ఒలింపిక్ సంఘం విప్లవాత్మక చర్యలు తీసుకుంటుంది. 2024 ఒలింపిక్స్‌లో భారత హ్యాండ్‌బాల్ జట్లు పోటీపడేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించాం' అని జగన్మోహన్ రావు తెలిపారు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు అందించిన క్రీడా సంఘాలకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రత్యేక గ్రాంట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐఓఏ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగన్మోహన్ రావు క్రీడా సంఘాలకు ప్రోత్సాహక గ్రాంట్ చెక్కులను ప్రదానం చేశారు. అథ్లెటిక్స్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, వెయిట్లిఫ్లింగ్, హాకీ, రెజ్లింగ్ సంఘాలకు రూ.25 లక్షల చొప్పున అందజేశారు.