Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్విస్ స్టార్‌కు మళ్లీ మోకాలి శస్త్రచికిత్స
న్యూఢిల్లీ: టెన్నిస్ దిగ్గజం, స్విస్ యోధుడు రోజర్ ఫెదరర్ మూడోసారి మోకాలి శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నాడు. నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో ఓటమి అనంతరం ఫెదరర్ రెండుసార్లు మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నారు. సమారు 13 నెలల రిహాబిలిటేషన్ అనంతరం తిరిగి ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో బరిలోకి దిగారు. వింబుల్డన్‌కు ఫిట్‌గా ఉండటం కోసం పారిస్‌లో మూడో రౌండ్లోనే పోటీ నుంచి తప్పుకున్నారు. వింబుల్డన్ క్వార్టర్ఫైనల్లో వరుస సెట్లలో అనూహ్య పరాజయం చవిచూసిన ఫెదరర్.. ఇప్పుడు మరో శస్త్రచికిత్సకు రెఢ అయ్యారు. ' రానున్న కొన్ని వారాలు ఊతకర్రల సాయంతో నడవనున్నాను. ఆటకు చాలా మాసాలు దూరం కానున్నాను. దీర్ఘకాలికంగా మెరుగ్గా, ఫిట్‌గా ఉండేందుకు మరో సర్జరీ అవసరం. ఈ వయసులో మరో సర్జరీ సాహాసమే. అయినా, నేను ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటున్నాను. నాకు నిలుస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు' అని ఫెదరర్ ఇన్స్టాగ్రామ్ వీడియాలో పేర్కొన్నాడు.