Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అఫ్గాన్ క్రికెటర్‌పై పీటర్సన్
న్యూఢిల్లీ : అఫ్గానిస్థాన్ తాలిబన్ల వశమైంది. తాలిబన్ సేనలు రాజధాని కాబూల్‌కు చేరడానికి ముందే అధ్యక్షుడు ఘాని తజకిస్థాన్‌కు పలాయం చిత్తగించాడు. రాజకీయ అస్థిరత, భవిష్యత్‌పై ఆందోళనతో అక్కడి ప్రజలు విదేశాలకు వెళ్లేందుకు కాబూల్‌లోని హామిద్ కర్జారు అంతర్జాతీయ విమానాశ్రయానికి పోటెత్తుతున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న అఫ్గాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ ది హండ్రెడ్ టోర్నీలో ట్రెంట్ రాకెట్స్ తరఫున ఆడుతున్నాడు. రషీద్ ఖాన్ కుటుంబం అఫ్గానిస్థాన్లోనే ఉంది. కుటుంబాన్ని ఇంగ్లాండ్‌కు రప్పించే ప్రయత్నాలు ఫలించకపోవటంతో రషీద్ ఖాన్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడని ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ తెలిపాడు. ' స్వదేశంలో ఏమేమో జరుగుతున్నాయి. రషీద్ ఖాన్ తన కుటుంబాన్ని అఫ్గాన్ ఆవలకు తీసుకురాలేక పోతున్నాడు. రషీద్ ఖాన్ అంశంలోనూ ఏన్నో విషయాలు చోటు చేసుకుంటున్నాయి' అని పీటర్సన్ తెలిపాడు. మ్యాచ్ సందర్భంగా బౌండరీ లైన్ వద్ద రషీద్ ఖాన్‌తో పీటర్సన్ సుదీర్ఘంగా మాట్లాడారు. అనంతరం రషీద్ ఖాన్ పరిస్థితిపై స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడారు.