Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ
న్యూఢిల్లీ : ఐసీసీ టోర్నీ ఏదైనా, మెగా ఈవెంట్ జరిగేది ఎక్కడైనా.. కప్పు కొట్టాలంటే ముందు భారత్‌ను దాటేయాలని వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ సామీ అన్నాడు. ' 2016 టీ20 ప్రపంచకప్ కోసం మేము స్వదేశానికి వీడినప్పుడు.. కోచ్, ఇతర ఆటగాళ్లు ఒక్కటే మాట అన్నారు. అది సెమీఫైనల్, ఫైనల్ ఏదైనా కప్పు నెగ్గాలంటే భారత్‌ను ఓడించాలి. ప్రపంచకప్ వేదిక యుఏఈకి మారినా.. ఐపీఎల్ అనుభవంతో భారత్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఇటీవల ఐసీసీ టోర్నీలు టెస్టు చాంపియన్‌షిప్, వన్డే వరల్డ్‌కప్‌లలోనూ భారత్‌ను ఓడిస్తేనే ట్రోఫీ దక్కింది' అని సామీ గుర్తుచేశారు. 2021 టీ20 ప్రపంచకప్ ఆరంభంలోనే పాకిస్థాన్‌తో ఆడటం మేలు చేయగలదని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. '2007 టీ20 ప్రపంచకప్‌లో మా తొలి మ్యాచ్ స్కాట్లాండ్తో, వర్షం కారణంగా రద్దు అయ్యింది. తర్వాతి మ్యాచ్ పాకిస్థాన్. వాస్తవికంగా భారత్ తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో తలపడింది. దీంతో మానసికంగా పాకిస్థాన్‌తో మ్యాచ్ గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. డ్రెస్సింగ్‌రూమ్, ఇటు అభిమానులకు పాక్ మ్యాచ్ ఆలోచన ఉండదు. ఫలితంతో సంబంధం లేకుండా.. టోర్నీ ఆరంభంలోనే భారత్, పాకిస్థాన్‌లు తలపడనుండటం సంతోషకరం' అని గంభీర్ అన్నాడు.