Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి దశలో 9 మంది బృందం
న్యూఢిల్లీ : భారత పారాలింపియన్లు టోక్యో నగరంలో అడుగుపెట్టారు. ఆగస్టు 24-సెప్టెంబర్ 5 వరకు టోక్యో నగరం 2020 పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మెగా ఈవెంట్లో భారత్ నుంచి 57 మంది పారా అథ్లెట్లు పోటీపడుతున్నారు. పారాలింపిక్స్‌కు తొలి దశలో తొమ్మిది మందితో కూడిన పారా బృందం టోక్యోకు చేరుకుంది. రియో ఒలింపిక్స్ పసిడి పతక విజేత మరియప్పన్ తంగవేలు, డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్, జావెలిన్ త్రోయర్ టెక్ చంద్‌లు ఆరుగురు సహాయక సిబ్బంది బుధవారం టోక్యోకు చేరుకున్నారు. పారాలింపిక్ అథ్లెట్ల బృందంతో ప్రధాని మోడీ భేటీ కాగా.. విమానాశ్రయంలో భారత పారాలింపిక్ కమిటీ (పీసీఐ) పారా బృందాన్ని ఆత్మీయంగా పంపించింది