Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టార్ బ్యాటర్ స్మృతీ మంధాన
న్యూఢిల్లీ : భారత్‌లో మహిళల క్రికెట్ నాణ్యత మెరుగుదల, జాతీయ జట్టు బెంచ్ బలం పెంపుదలకు మహిళల ఐపీఎల్లో జట్ల సంఖ్యను పెంచటమే మార్గమని స్టార్ బ్యాటర్, టీ20 వైస్ కెప్టెన్ స్మృతీ మంధాన తెలిపింది. రవిచంద్రన్ అశ్విన్ యూట్యూబ్ చానల్లో మంధాన ఈ వ్యాఖ్యలు చేసింది. ' దేశవాళీ సర్క్యూట్లో ఎన్ని రాష్ట్రాలకు మెన్స్ జట్లు ఉన్నాయో, మహిళలకు అన్నే జట్లు ఉన్నాయి. ఐపీఎల్లో ఆడటం మొదలైన నాటి నుంచి దేశవాళీ సర్క్యూట్లో మెన్స్ క్రికెట్ నాణ్యత మెరుగైంది. ఈ రోజు ఐపీఎల్.. పదేండ్ల ముందు ఐపీఎల్ ఒక్కటి కాదు. మహిళ క్రికెట్‌కూ ఇదే వర్తిస్తుంది. ఆరు జట్లతో ఆడగల మహిళా క్రికెటర్లు భారత్‌లో ఉన్నారు. ఆరు జట్లతో మహిళల ఐపీఎల్‌ను ఆరంభించకపోతే, అమ్మాయిలకు మెరుగైన అవకాశాలు ఇవ్వనట్టే. నాలుగేండ్ల క్రితం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆడాను. కానీ ఇప్పుడు బిగ్‌బాష్ లీగ్ అప్పటిలా లేదు. ఇప్పుడు ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడేందుకు సుమారు 40-50 మంది క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. ఆసీస్ దేశవాళీ క్రికెట్ నాణ్యతలోనూ ఎంతో మార్పు కనిపిస్తోంది. భారత మహిళల క్రికెట్లోనూ ఈ మార్పు రావాలని నేను కోరుకుంటున్నాను. మహిళల ఐపీఎల్‌తో దేశవాళీ క్రికెట్లోనూ గుణాత్మక మార్పు రాగలదు' అని మంధాన అభిప్రాయపడింది.