Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గోల్డ్, సిల్వర్ కప్‌లు ఆవిష్కరణ
నవతెలంగాణ, హైదరాబాద్ :
ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ హాకీ టోర్నమెంట్ తొలిసారి హైదరాబాద్‌కు రానుంది. గూంచా గ్రూప్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న 57వ నెహ్రూ సీనియర్ హాకీ టోర్నీ నవంబర్ 14-25న నిర్వహించనున్నట్టు నిర్వాహకులు గురువారం వెల్లడించారు. సోసైటీ సభ్యులు, గూంచా గ్రూప్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విజేతలకు అందజేసే గోల్డ్, సిల్వర్ కప్‌లను ఆవిష్కరించారు.బారత సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఎంతోమంది ఆటగాళ్లు పోటీపడిన చరిత్ర ఈ టోర్నీ సొంతం. ఇండియన్ రైల్వేస్, ఆర్మీ ఎలెవన్, ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఎస్సీ రైల్వే, కెనరా బ్యాంక్, ఇండియన్ ఆయిల్, ఓఎన్జీసీ, ముంబయి ఎలెవన్, తమిళనాడు ఎలెవన్, తెలంగాణ ఎలెవన్, కాగ్ ఎలెవన్, ఎంపీ హాకీ అకాడమీ, బోపాల్, ఎయిర్ ఇండియాలు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. విజేతకు గోల్డ్ కప్ సహా రూ.4 లక్షల నగదు బహుమతి, రన్నరప్‌కు సిల్వర్ కప్ సహా రూ.2 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నారు. భారత ప్రథమ ప్రధాని నెహ్రూ జ్ఞాపకార్థం దివంగత వ్యాపారవేత్త ఐ.ఎం కపూర్ 1964లో నెహ్రూ హాకీ టోర్నమెంట్ సోసైటీ (జెఎన్హెచ్టీఎస్) స్థాపించి ప్రతి ఏడాది టోర్నీలు నిర్వహిస్తున్నారు. గూంచా గ్రూప్ వ్యవస్థాపకులైన ఐఎం కపూర్ గతేడాది కన్నుమూశారు. హైదరాబాద్‌లో పలు పరిశ్రమలు స్థాపించిన ఐఎం కపూర్ స్మారకార్థం ఈ హాకీ టోర్నీని హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నారు. గూంచా గ్రూప్ అందుకు ఐదేండ్లకు టైటిల్ స్పాన్సర్‌గా సోసైటీతో ఒప్పందం కుదుర్చుకుంది.