Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు బహుమతుల ప్రదానం
నవతెలంగాణ, హైదరాబాద్ :
హుస్సేన్ సాగర్ తీరంలో వారం రోజుల పాటు ఉత్సాహంగా సాగిన జాతీయ స్థాయి సెయిలింగ్ పోటీలు ముగిశాయి. 35వ హైదరాబాద్ సెయిలింగ్ వీక్ విజేతలకు అడ్మిరల్ కరంబీర్ సింగ్ బహుమతులు ప్రదానం చేశారు. లేజర్ 4.7 బాలికల విభాగంలో రితిక చాంపియన్‌గా నిలువగా నేహా, ప్రియలు తర్వాతి స్థానాల్లో నిలిచారు. లేజర్ 4.7 బాలుర విభాగంలో చున్ను కుమార్ బంగారు పతకం సాధించగా, కిరణ్ కుమార్, సంజరు రెడ్డిలు రజత, కాంస్య పతకాలు గెల్చుకున్నారు. లేజర్ రేడియల్ మహిళల విభాగంలో వైష్ణవి విజేతగా నిలిచింది. అశ్విని, సాన్యలు ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించారు. లేజర్ రేడియల్ మెన్స్ విభాగంలో సిఖాన్షు సింగ్ చాంపియన్‌గా నిలువగా.. అవినాష్ యాదవ్, రామిలాన్ యాదవ్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు. లేజర్ స్టాండర్డ్ విభాగంలో మోహిత్ సైని బంగారు పతకం, ఇస్రాజ్ అలీ రజత పతకం, దిలీప్ కుమార్ కాంస్య పతకం గెల్చుకున్నారు.