Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్నాను వీడిన డుబ్కీ కింగ్ పర్దీప్ నర్వాల్
- ఆగస్టు 29-31న ప్రొ కబడ్డీ ఆటగాళ్ల వేలం
ముంబయి : రెండేండ్ల విరామం అనంతరం ప్రొ కబడ్డీ తిరిగి అభిమానుల ముందుకు రాబోతుంది. ఆటగాళ్లు అతి చనువుగా మెలిగే కబడ్డీలో కరోనా ఆంక్షలు ప్రొ కబడ్డీ సీజన్‌ను ఆలస్యం చేశాయి. బయో బుడగ సహా ఇతర మార్గదర్శకాలు పాటిస్తూ ఇతర క్రీడలు పట్టాలెక్కటంతో ప్రో కబడ్డీ సైతం చల్ కబడ్డీ అంటోంది. ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌కు ఆటగాళ్ల వేలం ఆగస్టు 29-31న ముంబయిలో నిర్వహించనుంది. ఈ మేరకు పీకేఎల్ నిర్వాహకులు ప్రకటించారు. 12 జట్లు పాల్గొంటున్న పీకేఎల్ 7లో ఆటగాళ్ల వేలానికి ప్రతి ప్రాంఛైజీకి రూ.4.4 కోట్లు అందుబాటులో ఉన్నాయి. సీజన్ ఆరంభానికి ప్రతి ప్రాంఛైజీకి ఎలైట్, న్యూ ప్లేయర్లను అట్టిపెట్టుకునే అవకాశం కల్పించారు. మూడు సార్లు పట్నా పైరేట్స్‌ను విజేతగా నిలిపిన డుబ్కీ కింగ్, ఆ జట్టు కెప్టెన్ పర్దీప్ నర్వాల్‌ను ప్రాంఛైజీ వదులుకుంది. ఆటగాళ్ల వేలంలో పర్దీప్ నర్వాల్ కోసం తెలుగు టైటాన్స్ తీవ్రంగా ప్రయత్నించే అవకాశం కనిపిస్తోంది. రాకేశ్ గౌడను తెలుగు టైటాన్స్ అట్టిపెట్టుకోగా.. యు ముంబా నలుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. యూపీ యోధ, యు ముంబా, తెలుగు టైటాన్స్, పుణెరి పల్టన్, పట్నా పైరేట్స్, జైపూర్ పింక్‌పాంథర్స్, హర్యానా స్టీలర్స్, గుజరాత్ జెయింట్స్, దబంగ్ ఢిల్లీ, బెంగళూర్ బుల్స్, బెంగాల్ వారియర్స్‌లు పీకేఎల్ 7లో టైటిల్ కోసం పోటీపడనున్నాయి.