Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 ప్రపంచకప్‌పై కోహ్లితో బోర్డు చర్చ
ముంబయి : 2013 తర్వాత టీమ్ ఇండియా ఐసీసీ ట్రోఫీ గెలువలేదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో, 2019 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో, 2021 ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత్ పరాజయాలు చవిచూసింది. విరాట్ కోహ్లి నాయకత్వంలో మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు నెగ్గే అవకాశం మెరుగ్గా ఉన్నప్పటికీ..భారత్‌కు అపజయాలే ఎదురయ్యాయి. 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ రూపంలో భారత్‌కు, విరాట్‌కోహ్లికి మరో అవకాశం లభించింది. కెప్టెన్‌గా అత్యుత్తమ జట్టును కలిగి ఉన్నా, ఐసీసీ ట్రోఫీ సాధించలేని ఒత్తిడి విరాట్ కోహ్లిపై ఉంది. ఇంగ్లాండ్‌పై లార్డ్స్ టెస్టు విజయంతో కోహ్లిలో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నా.. టీ20 ప్రపంచకప్‌లో కోహ్లి కఠిన పరీక్ష ఎదుర్కొన్నాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లితో బీసీసీఐ నాయకత్వం సౌరవ్ గంగూలీ, జై షా, రాజీవ్ శుక్లాలు అనధికారికంగా చర్చించినట్టు సమాచారం. టీ20 ప్రపంచకప్ నెగ్గేందుకు జట్టు మేనేజ్మెంట్ రోడ్‌మ్యాప్‌పై బోర్డు నాయకత్వం ఆరా తీసిందని తెలుస్తుంది. టీ20 ప్రపంచకప్‌కు జట్టుకు ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది. సెప్టెంబర్ 14న ఇంగ్లాండ్ పర్యటన నుంచి నేరుగా ఐపీఎల్ ప్రాంఛైజీలకు వెళ్లనున్న క్రికెటర్లు.. అక్కడ్నుంచే టీ20 ప్రపంచకప్‌కు రెఢ అవనున్నారు. జట్టు ఎంపిక, మణికట్టు స్పిన్నర్లు, ఆల్‌రౌండర్లు, పేసర్లు, ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కీలక ఆటగాళ్ల పని భారం వంటి విషయాలపై కోహ్లితో మాట్లాడారు. సీనియర్ సెలక్షన్ కమిటీ, జట్టు మేనేజ్మెంట్ జట్టు ఎంపిక విషయంలో ఏకతాటిపైకి వచ్చేలా బోర్డు సూచించినట్టు సమాచారం.