Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 10000మీ నడకలో అమిత్ కుమార్ జోరు
- అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ : ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో టీమ్ ఇండియా యువ అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. తొలి రోజు రిలే పరుగులో స్ప్రింటర్లు భారత్‌కు కాంస్య పతకం సాధించగా.. తాజాగా 10000మీటర్ల నడకలో అమిత్ కుమార్ రజతం పట్టుకొచ్చాడు. కెన్యా రాజధాని నైరోబీలో జరుగుతున్న అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో 42 నిమిషాల 17:94 సెకండ్లలో నడక పూర్తి చేసిన అమిత్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. ఆఖరు వరకు నడకలో పసిడి వైపు దూసుకెళ్లిన అమిత్ కుమార్‌ను కెన్యా అథ్లెట్ చివర్లో దాటేశాడు. 42:10.84 సెకండ్లతో బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. పాల్ మెక్‌గ్రాత్ (42:31.11)కు కాంస్య పతకం లభించింది. ' నైరోబీ సమద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో శ్వాస సమస్యలు ఎదుర్కొన్నాను. అంతర్జాతీయ స్థాయిలో ఇదే నాకు తొలి టోర్నమెంట్. భారత్‌కు సిల్వర్ పతకం సాధించినందుకు సంతోషంగా ఉంది' అని అమిత్ కుమార్ అన్నాడు. గతంలో భారత్‌కు జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో నీరజ్ చోప్రా (2012), హిమ దాస్ (2018) బంగారు పతకాలు సాధించగా.. సీమ ఆంటిల్ (2002), నవజీత్ కౌర్ (2014) కాంస్య పతకాలు గెలిచారు.