Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, హైదరాబాద్ :
యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ విజయవంతంగా ముగిసింది. పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో సుమారు 150 మంది షట్లర్లు పోటీపడ్డారు. నిజాంపేట్‌లోని ఎస్ఎల్వీ బ్యాడ్మింటన్ అకాడమీ ఆతిథ్యమిచ్చిన ఈ చాంపియన్‌షిప్స్‌లో మెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా భీమ్ రావు నిలిచాడు. ఫైనల్లో 15-21, 21-10, 21-16తో జీనిత్పై గెలుపొందాడు. మెన్స్ డబుల్స్‌లో మజర్, వినాయక్ జోడీ 23-21, 21-23, 21-15తో భవదీర్, శశాంక్ జోడీపై గెలుపొంది టైటిల్ సాధించారు. మిక్స్డ్ డబుల్స్‌లో అభిషేక్, కృతిక జోడీ 21-10, 16-21, 21-14తతో భవధీర్, శ్రావ్యలపై విజయం సాధించారు. టోర్నీ టైటిల్ స్పాన్సర్ నంది టైర్స్ అండ్ ట్యూబ్స్ ఎండీ భరత్ రెడ్డితో కలిసి శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి బహుమతులు అందజేశారు. భవిష్యత్‌లో హైదరాబాద్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌ను మరింత భారీ స్థాయిలో నిర్వహించేందుకు కృషి చేస్తామని 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ చైర్మన్ బి. వెంకటేష్ తెలిపారు.