Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు దూరం
ముంబయి : భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ మెడలిస్ట్ బజరంగ్ పూనియా గాయం బారిన పడ్డాడు. టోక్యో ఒలింపిక్స్‌కు ముందు రష్యాలో స్పేరింగ్ పార్ట్నర్తో సాధన చేస్తుండగా బజరంగ్ కుడి కాలి మోకాలి గాయానికి గురయ్యాడు. గాయంతోనే టోక్యో ఒలింపిక్స్ మ్యాట్‌పై బరిలోకి దిగాడు. పసిడి ఫేవరేట్‌గా బరిలో నిలిచినా.. కాంస్య పతకంతో స్వదేశానికి వచ్చాడు. అక్టోబర్ తొలి వారంలో జరుగనున్న ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌కు బజరంగ్ దూరమయ్యాడు. గాయం తీవ్రత తెలుసుకునేందుకు ఎంఆర్ఐ స్కాన్ నివేదిక పరిశీలించిన వైద్య బృందం పూనియాకు ఆరు వారాల విశ్రాంతి సూచించింది. రిహాబిలిటేషన్ అనంతరమే సాధన షురూ చేయాల్సి ఉంటుంది. దీంతో ఈ ఏడాది రెజ్లింగ్ సీజన్‌కు దూరమైనట్టేనని పూనియా తెలిపాడు. ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే బలీయమైన లక్ష్యంతోనే గాయం వేధించినా టోక్యోలో పోటీపడ్డానని.. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో ఆడటం లేదని పూనియా అన్నాడు.