Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచ హాకీ వార్షిక అవార్డులు
న్యూఢిల్లీ : టోక్యో ఒలింపిక్స్ హాకీ హీరోలు ప్రతిష్టాత్మక హాకీ వార్షిక పురస్కారాల రేసులో నిలిచారు. పురుషుల జట్టు డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్ సింగ్, మహిళల జట్టు డ్రాగ్‌ఫ్లికర్ గుర్జిత్ కౌర్‌లు ప్రపంచ హాకీ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ రేసులో నిలిచారు. ఈ మేరకు సోమవారం భారత స్టార్ క్రీడాకారులు అవార్డుకు నామినేట్ అయ్యారు. పురుషుల జట్టు గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్ ఉత్తమ గోల్‌కీపర్ అవార్డు రేసులో నిలువగా.. మహిళల జట్టు గోల్‌కీపర్ సవిత పూనియ సైతం అవార్డు షార్ట్‌లిస్ట్‌లో నిలిచింది. భారత హాకీ మెన్స్, ఉమెన్స్ జట్ల కోచ్‌లు ఇద్దరూ ఉత్తమ కోచ్ అవార్డు బరిలో ఉన్నారు. హర్మన్‌ప్రీత్ ఆరు గోల్స్‌తో టోక్యోలో మెరువగా.. మహిళల జట్టులో గుర్జిత్ కౌర్ కీలక పాత్ర పోషించింది. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన తొలి భారత మహిళా హాకీ ప్లేయర్‌గా నిలిచిన ఫార్వర్డ్ ప్లేయర్ వందన కటారియను అవార్డుకు భారత హాకీ నామినేట్ చేయలేదు. వందన కటారియ, ఆమె కుటుంబం స్వదేశంలో కుల వివక్ష ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.