Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుబాయ్ : పాకిస్థాన్, అఫ్గనిస్థాన్ వన్డే సిరీస్ వచ్చే ఏడాదికి వాయిదా పడింది. అప్గనిస్థాన్‌లో ప్రస్తుతం తాలిబన్లు రాజ్యాధికారం చేజిక్కంచుకు న్నారు. రాజకీయ అధికార మార్పిడితో స్థానికంగా అఫ్గాన్‌లో అనిశ్చితి వాతావరణం కనిపిస్తోంది. తాలిబన్ల గత పాలనను తలచుకుని ప్రజలు కర్జారు విమానాశ్రయానికి క్యూ కడుతున్నారు. క్రికెటర్లు, కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి. దీంతో వచ్చే నెలలో శ్రీలంకలో జరగాల్సిన వన్డే సిరీస్‌ను 2022కు వాయిదా వేస్తున్నట్టు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు మంగళవారం ప్రకటించాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 1-8న పాక్, అఫ్గాన్ వన్డే సిరీస్ జరగాల్సి ఉంది. ' అఫ్గాన్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తి మేరకు వన్డే సిరీస్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నాం. కాబుల్ విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితులు, శ్రీలంకలో కోవిడ్-19 కేసుల పెరుగుదల, క్రికెటర్ల మానసిక ఆరోగ్యం, ప్రసారదారు సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం' అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. 2023 వన్డే ప్రపంచకప్‌కు అర్హత సాధించేందుకు ఇరు జట్లకు ఈ సిరీస్ కీలకం కానుంది.