Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కరాచీ : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్‌గా ఈషన్ మణి తప్పుకున్నారు. కొత్త చైర్మన్ ఎన్నికకు త్వరలోనే పాకిస్థాన్ ప్రధాన మంత్రి కార్యాలయం నొటిఫికేషన్ జారీ చేయనున్నట్టు పీసీబీ అధికారి ఒకరు తెలిపారు. ఈషన్ మణి మూడేండ్ల పదవీ కాలం ఆగస్టు 25తో ముగిసింది. మరో దఫా కొనసాగేందుకు మణి సుమఖంగా లేరు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రమీజ్ రాజా పీసీబీ నూతన చైర్మన్‌గా ఎన్నికయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీసీబీ చీఫ్ ప్యాట్రన్‌గా ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇద్దరు వ్యక్తులను బోర్డు ఆఫ్ గవర్నర్స్‌కు నామినేట్ చేయనున్నారు. అందులో ఒకరిని పీసీబీ చైర్మన్‌గా ఎన్నుకుంటారు.