Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్‌కు ఆడనున్న రషీద్
ముంబయి : ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్ నిమిత్తం పలు ప్రాంఛైజీలు కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నాయి. గాయాలు, ఇతర కారణాలతో అందుబాటులో లేని ఆటగాళ్ల స్థానంలో నూతన ఆటగాళ్లను ఎంచుకున్నారు. ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ తొలిసారి ఐపీఎల్లో ఆడనున్నాడు. జై రిచర్డ్సన్ స్థానంలో రషీద్‌ను పంజాబ్ ఎంచుకుంది. కివీస్ పేసర్ టిమ్ సౌథీ కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఆడనున్నాడు. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ స్థానంలో కోల్‌కత అతడిని తీసుకుంది. వాహిందు హసరంగ, దుష్మంత చమీరా, జార్జ్ గార్టెన్లను రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఎంచుకుంది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.