Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంతి విసిరిన ఇంగ్లాండ్ ఫ్యాన్స్
లీడ్స్ : ఆస్ట్రేలియా పర్యటనలో జాతి వివక్ష వ్యాఖ్యలకు గురైన భారత యువ పేస్ సంచలనం, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్.. తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలోనూ ఆ దేశ అభిమానుల చేదు అనుభవం చవిచూస్తున్నాడు!. ఇంగ్లాండ్‌తో మూడో టెస్టులో బౌండరీ లైన్ వద్ద మహ్మద్ సిరాజ్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ఇంగ్లీష్ అభిమానులు స్కోరు ఎంత? అని సిరాజ్‌ను ఎగతాళి చేశారు. అందుకు బదులుగా సిరాజ్ 1-0 అని చెప్పాడు. లార్డ్స్ విజయంలో కీలక భూమిక వహించిన సిరాజ్‌పై అభిమానులు బంతి విసిరినట్టు తొలి రోజు ఆట అనంతరం రిషబ్ పంత్ మీడియాతో చెప్పాడు. ' అభిమానుల్లో ఎవరో సిరాజ్‌పై బంతి విసిరారు. దీంతో కోహ్లి నిరుత్సాహానికి గురయ్యారు. అభిమానులు అరవచ్చు, నినాదాలు చేయవచ్చు కానీ ఆటగాళ్లపై ఇలా విసరటం క్రికెట్‌కు మంచిది కాదు. లీడ్స్ వికెట్‌పై తొలుత బ్యాటింగ్ చేయాలనేది జట్టు నిర్ణయమని' పంత్ అన్నాడు.