Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020 టోక్యో పారాలింపిక్స్
టోక్యో : భారత పారా టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవినా పటేల్ టోక్యోలో పతకం దిశగా ఓ అడుగు ముందుకేసింది. టేబుల్ టెన్నిస్ (క్లాస్ 4) విభాగంలో భవినా పటేల్ గ్రూప్ దశలో రెండో స్థానంలో నిలిచి నాకౌట్‌కు చేరుకుంది. వరల్డ్ నం.9, బ్రిటన్ క్రీడాకారిణి మేఘన్‌పై 11-7, 9-11, 17-15, 13-11తొ భవినా పటేల్ ఘన విజయం సాధించింది. తొలి సెట్‌ను సులువుగానే సాధించిన భవినాకు రెండో సెట్లో ఓటమి ఎదురైంది. టైబ్రేకర్లకు దారితీసిన తర్వాతి సెట్లలో భవినా అద్భుతంగా రాణించింది. టేబుల్ టెన్నిస్ (క్లాస్ 3) విభాగంలో మరో పారా అథ్లెట్ సోనెల్బెన్ మనుభాయి పటేల్‌కు నిరాశ ఎదురైంది. గ్రూప్ దశ రెండో మ్యాచ్‌లో దక్షిణ కొరియా అథ్లెట్ చేతిలో ఆమె పరాజయం పాలైంది. 12-10, 5-11, 3-11, 9-11తో 1-3తో ఓటమి చవిచూసింది.