Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్: న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, ఆల్రౌండర్ క్రిస్ కెయిన్స్ పక్షవాతం బారిన పడ్డాడు. కెయిన్స్ గుండెకు ఆపరేషన్ చేస్తున్న సమయంలో స్ట్రోక్ రావడంతో కెయిన్స్ కాళ్లకు పక్షవాతం సోకినట్లు సమాచారం. తొలుత క్యాన్బెరాలోని హాస్పిటల్లో గుండెపోటుకు చికిత్స తీసుకుంటుండగా.. సర్జరీ కోసం డాక్టర్లు సిడ్నీకి తరలించారు. అక్కడ అత్యవసర సర్జరీ చేస్తుండగా.. కాళ్లకు పక్షవాతం సోకిందని డాక్టర్లు తెలిపారు. క్రిస్ కెయిన్స్ ఇప్పట్లో కోలుకునేలా కనిపించడం లేదని, కాళ్లు చచ్చుబడిపోవడంతో ఆస్ట్రేలియాలోనే మరో హాస్పిటల్లో రీహాబి లిటేషన్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు డాక్టర్లు తెలిపారు. న్యూజిలాండ్ తరఫున కెయిన్స్ 1989 నుంచి 2004 మధ్య 62 టెస్టులు ఆడాడు.