Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌కు చేరిన తొలి టిటి క్రీడాకారిణిగా రికార్డు
టోక్యో : పారాలింపిక్స్ మహిళల టేబుల్‌టెన్నిస్ క్లాస్-4 విభాగంలో భవినా బెన్ పటేల్ చరిత్ర సృష్టించింది. మహిళల టిటి విభాగంలో సెమీస్‌కు చేరిన తొలి పారా మహిళా టిటి క్రీడాకారిణిగా భవనా బెన్ ఈ రికార్డును నెలకొల్పింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ పోటీలో భవినా(3-0) 11-5, 11-6, 11-7తో వరుస సెట్లలో ప్రపంచ 2వ ర్యాంకర్, రియో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత రాంకోవిక్(సెర్బియా)ను చిత్తుచేసింది. భవినా ప్రత్యర్థి రాంకోవిక్‌ను కేవలం 18 నిమిషాల్లోనే చిత్తుచేయడం విశేషం. సెమీస్‌లో గెలిస్తే భవినాకు రజిత పతకం ఖాయం కానుంది. సెమీస్‌లో చైనాకు చెందిన మియావో ఝాంగ్‌తో తలపడనుంది. అంతకుముందు జరిగిన ప్రి క్వార్టర్‌ఫైనల్ పోటీలో భవినా12-10 13-11, 11-6తో బ్రెజిల్‌కు చెందిన ఓర్సు-డి-ఒలివీరాను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. ఆ మ్యాచ్‌ను భవినా 23 నిమిషాల్లోనే ముగించడం విశేషం.
తొలిరౌండ్లోనే టెక్ చంద్ ఓటమి
భారత పారాలింపిక్ ఫ్లాగ్ బేరర్ టెక్ చంద్ షాట్‌పుట్ విభాగంలో నిరాశపరిచాడు. శుక్రవారం జరిగిన లీగ్‌లో 9.04మీటర్లు విసిరి 8మంది ప్రాతినిధ్యం వహించిన గ్రూప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఆరు ప్రయత్నాల్లో భాగంగా నాలుగు త్రోలను ఫౌల్ వేసిన టెక్ చంద్ రెండో ప్రయత్నంలో 8.57మీటర్లు, 4వ ప్రయత్నంలో 9.04 పర్సనల్ బెస్ట్‌ను నమోదు చేశాడు. ఈ విభాగంలో బ్రెజిల్‌కు చెందిన వాలెస్(12.63మీ.), బల్గేరియాకు చెందిన రుజ్ది(12.47మీ.) ఫైనల్‌కు అర్హత సాధించారు.
పవర్ లిఫ్టింగ్‌లోనూ నిరాశే..
పురుషుల 65కిలోల పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో జైదీప్ నిరాశపరిచాడు. మూడు ప్రయత్నాల్లో భాగంగా 160కిలోల బరువును రెండు ప్రయత్నాల్లో ఎత్తి.. మూడో ప్రయత్నంలో 167కిలోల బరువును మాత్రమే లిఫ్ట్ చేయగలిగాడు. ఈ విభాగంలో చైనాకు చెందిన లీ-లూ 198కిలోలు స్వర్ణం గెలుచుకోగా.. అమీర్ జఫారి(ఇరాన్) 195కిలోలు, హోసినే(అల్జీరియా) 192కిలోలు రజిత, కాంస్య పతకాలను సాధించారు. ఇక 50కిలోల మహిళల పవర్‌లిఫ్టింగ్‌లో ఫైనల్‌కు చేరి పతకంపై ఆశలు రేపిన సకీనా ఖతూన్ 5వ స్థానంలో నిలిచింది. తొలి ప్రయత్నంలో 90కిలోలు, మూడో ప్రయత్నంలో 93కిలోలు మాత్రమే లిఫ్ట్ చేయగల్గింది.
ఆర్చరీ తొలిరౌండ్లోనూ ఓటమే..
ఆర్చరీ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగం తొలిరౌండ్ పోటీలో భారత్‌కు చెందిన రాకేశ్ కుమార్-జ్యోతి పరాజయం పాలయ్యారు. తొలిరౌండ్ పోటీలో రాకేశ్(699పాయింట్లు), జ్యోతి(671పాయింట్లు) మొత్తం 1370పాయింట్లు మాత్రమే సాధించగలిగారు. ఇక చైనా బృందం 1388పాయింట్లు సాధించి విజయం సాధించింది. పురుషుల వ్యక్తిగత విభాగంలో రాకేశ్ కుమార్(క్లాస్ డబ్ల్యు-2) విభాగంలో 699పాయింట్లు) సాధించి రికార్డు నెలకొల్పి మూడోస్థానంలో నిలిచాడు. ఎస్ఎస్ స్వామి 682పాయింట్లతో 21వ స్థానంలో నిలిచాడు.