Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోహిత్ అర్ధసెంచరీ
- ఇంగ్లండ్‌కు 354పరుగుల ఆధిక్యత
లీడ్స్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడోటెస్ట్ ఉత్కంఠగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 354 పరుగుల భారీ ఆధిక్యతను సాధించడంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆచి తూచి ఆడుతున్నారు. శుక్రవారం ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకు ఆలౌట్ కావడంతో ఆ జట్టుకు భారీ ఆధిక్యత లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారతజట్టు టీ విరామ సమయానికి 46ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(59), పుజారా(40) క్రీజ్‌లో ఉన్నారు. రోహిత్-పుజారా కలిసి 78 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్(8) రెండో ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. ఓవర్టన్ బౌలింగ్‌లో బెయిర్‌స్టోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అంతకుముందు ఇంగ్లండ్ జట్టు ఓవర్ నైట్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 423 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించి 432 పరుగులకు ఆలౌటైంది. మరో 9పరుగులు మాత్రమే జోడించి చివరి 2 వికెట్లను ఇంగ్లండ్ కోల్పోయింది. ఓవర్టన్(32)ను షమీ ఔట్ చేయగా.. రాబిన్సన్ను బుమ్రా బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు గంటలోపే తొలి ఇన్నింగ్స్ ముగిసింది. భారత బౌలర్లలో షమీకి నాలుగు, బుమ్రా, సిరాజ్, జడేజలకు చెరో రెండు వికెట్లు దక్కాయి.
స్కోర్‌బోర్డు..
భారత్ తొలి ఇన్నింగ్స్ 78పరుగులు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 432పరుగులు
భారత్ రెండో ఇన్నింగ్స్(టీ విరామ సమయానికి): 46 ఓవర్లలో వికెట్ నష్టానికి 112 పరుగులు.