Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జొహనెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం డేల్ స్టెయిన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 17 ఏండ్ల సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నట్టు సఫారీ పేసర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. దక్షిణాఫ్రికా తరఫున డేల్ స్టెయిన్ 93 టెస్టులు, 125 వన్డేలు, 47 టీ20ల్లో ప్రాతినిథ్యం వహిం చాడు. 2019 ఆగస్టులో టెస్టు క్రికెట్ నుంచి నిష్క్రమించిన స్టెయిన్ తాజాగా పూర్తిగా క్రికెట్‌కు గుడ్‌బై పలికాడు. '20 ఏండ్లుగా ట్రైనింగ్, మ్యాచులు, ప్రయా ణాలు, విజ యాలు, అపజ యాలు, ఉత్సాహం, సోదరభావం.. ఇలా ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఎంతో మంది కృతజ్ఞలు తెలపాలి. నేను అమితంగా ప్రేమించిన ఆట నుంచి ఈ రోజు అధికారికంగా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. కుటుంబ సభ్యులు, జట్టు సహచరులు, పాత్రికేయులు, అభిమానులు, అందరికీ ధన్యవాదాలు' అని స్టెయిన్ ట్వీట్ చేశాడు.