Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో పది జట్లు పోటీపడేందుకు రంగం సిద్ధమవుతోంది. ఐపీఎల్లో ప్రస్తుతం ఎనిమిది జట్లు ఉండగా.. ఈ సంఖ్యను పదికి పెంచాలని గతంలో బీసీసీఐ ఏజీఎం తీర్మానించింది. 2022 సీజన్ నుంచి పది జట్ల ఐపీఎల్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తాజాగా టెండరు నోటీసులు విడుదల చేసింది. అహ్మదాబాద్, లక్నోలు నూతన ప్రాంఛైజీల నగరాల జాబితాలో ముందున్నాయి. రూ.10 లక్షలకు ఇన్విటేషన్ టు టెండర్‌ను కొనుగోలు చేసిన కంపెనీల వివరాలను సమీక్షించిన అనంతరం బిడ్డింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఒకే సంస్థ లేదా కొన్ని సంస్థలు బృందంగా ఏర్పడి సైతం ఐపీఎల్ ప్రాంఛైజీల బిడ్ కోసం పోటీపడవచ్చని బీసీసీఐ తెలిపింది. ఇన్విటేషన్ టు టెండర్ల అక్టోబర్ 5 వరకు అందుబాటులో ఉంచనున్నట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది.