Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2020 టోక్యో పారాలింపిక్స్
నవతెలంగాణ-టోక్యో
వరుసగా మూడు రోజులు పతక వర్షం కురిపించిన భారత పారా అథ్లెట్లు.. బుధవారం పతక జోరుకు విరామం ఇచ్చినట్టు ఉన్నారు!. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో బుధవారం మూడు పతక ఈవెంట్లలో పోటీపడినా.. భారత్‌కు మెడల్ రాలేదు. షూటింగ్ పసిడితో చరిత్ర సృష్టించిన అవని లేఖర.. మిక్స్డ్ జట్టు విభాగంలో పతకం కొట్టలేదు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఆర్3 ప్రోన్ (ఎస్‌హెచ్1) మిక్స్డ్ జట్టు విభాగంలో భారత్ ఫైనల్స్‌కు అర్హత సాధించలేదు. సిద్ధార్థ్ బాబు, దీపక్, అవనిలు పోటీపడిన ఈ విభాగంలో వరుసగా 105.9, 105.0, 104.9, 105.3, 104.2, 104.9 పాయింట్లు స్కోరు చేశారు. ఓవరాల్‌గా 629.7 పాయింట్లతో 27వ స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు దూరమయ్యారు. 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్ ఎస్బీ7 స్విమ్మింగ్‌లో ఫైనల్‌కు చేరిన సుయస్ జాదవ్ అనర్హత వేటుకు గురయ్యాడు. ఫైనల్లో నిబంధనలకు విరుద్ధంగా వెళ్లిన జాదవ్‌పై టెక్నికల్ టీమ్ అనర్హత వేటు వేసింది. మెన్స్ క్లబ్ త్రో ఎఫ్51 విభాగంలో భారత్ నుంచి ఇద్దరు అథ్లెట్లు ఫైనల్‌కు చేరుకున్నారు. అమిత్ కుమార్ 25.41, 27.77, 24.86, 26.68 మీటర్లతో మెరిసి ఐదో స్థానంలో నిలిచాడు. ధరంభీర్ ఆరు ప్రయత్నాల్లో ఒక్కసారే విసరగలిగాడు. 25.99 మీటర్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. బ్యాడ్మింటన్‌లో తొలిరోజు భారత్‌కు నిరాశే ఎదురైంది. మహిళల ఎస్ఎల్3 ఎస్యు5 విభాగంలో పాలక్ కోహ్లి పరాజయం పాలైంది. గ్రూప్ మ్యాచ్‌లో టాప్ సీడ్ సుజికి (జపాన్) చేతిలో 4-21, 7-21తో వరుస గేముల్లో ఓటమి చెందింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రమోద్ భగత్, కోహ్లి జోడీ 9-21, 15-21, 19-21తో పోరాడి ఓడింది.