Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫారో: పోర్చుగల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్లో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఫిఫా ప్రపంచకప్ అర్హత టోర్నీలో ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో 2గోల్స్ కొట్టి ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో రోనాల్డ్ అంతర్జాతీయ మ్యాచుల్లో 111 గోల్స్ కొట్టినట్లైంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. పోర్చుగల్ 2-1 తేడాతో సంచలన విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఇరాన్ ఫుట్‌బాల్ ఆటగాడు అలీ డయి(109 అంతర్జాతీయ గోల్స్) పేరిట ఉండేది. ఆ రికార్డును రోనాల్డో తాజాగా బ్రేక్ చేశాడు. 1993నుంచి 2006వరకు అలీ డయి ఇరాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ టోర్నీల్లో 90కి పైగా గోల్స్ చేసిన ఆటగాళ్లలో అలీ డయి(ఇరాన్), రోనాల్డ్(పోర్చుగల్) మాత్రమే ఉన్నారు.