Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఖాట్మండు: భారత్-నేపాల్ జట్ల మధ్య దశరథ్ స్టేడియంలో జరిగిన తొలి అంతర్జాతీయ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ 1-1 గోల్స్‌తో డ్రా అయ్యింది. నిర్ణీత సమయానికి ఇరుజట్లు ఒక్కో గోల్‌ను మాత్రమే నమోదు చేయగలిగాయి. భారత్ తరఫున అనిరుథ్ థాపా(60వ ని.) గోల్ కొట్టగా.. తొలి అర్ధభాగం 36వ నిమిషంలో నేపాల్ ఆటగాడు అంజన్ బిస్టా గోల్ చేయడంతో ఆ జట్టు 1-0 ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. రెండో అర్ధభాగం 60వ నిమిషంలో భారత్ తరఫున గోల్ నమోదు కావడంతో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి ఫ్రెండ్లీ మ్యాచ్ డ్రా అయ్యింది. మలేషియా వేదికగా అక్టోబర్‌లో జరగనున్న దక్షిణాసియా ఫుట్‌బాల్ సమాఖ్య(సాఫ్) ఛాంపియన్‌షిప్‌కు భారత్ సన్నాహకంగా నేపాల్ పర్యటనకు వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండు స్నేహపూర్వక మ్యాచ్‌లు జరగనున్నాయి. రెండో మ్యాచ్ 5న(ఆదివారం) జరగనుంది. ఆ టోర్నీలో భారత్ ఫేవరేట్‌గా బరిలో దిగుతుండగా.. నేపాల్, మలేషియా, శ్రీలంక జట్లు కూడా బరిలోకి దిగనున్నాయి. గతంలో భారత్ ఐదుసార్లు సాఫ్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.