Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: పారాలింపిక్స్ బ్యాడ్మింటన్స్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి భారత్‌కు చెందిన టాప్‌సీడ్ ప్రమోద్ భగత్ ప్రవేశించాడు. గురువారం జరిగిన గ్రూప్-ఏ క్లాస్ ఎస్ఎల్-3 లీగ్ మ్యాచ్‌లో ప్రమోద్ 21-12, 21-9 తేడాతో ఉక్రెయిన్‌కు చెందిన ఒలెక్సాండ్ను చిత్తుచేశాడు. ఈ మ్యాచ్‌ను 33ఏళ్ల ప్రమోద్ కేవలం 26 నిమిషాల్లో ముగించాడు. గ్రూప్-ఏ మరో పోటీలో 28ఏళ్ల సుహాస్ 21-9, 21-3 తేడాతో కేవలం 19నిమిషాల్లోనే పోట్ను చిత్తుచేయగా.. గ్రూప్-బిలో తరుణ్ 21-7, 21-13తో, కృష్ణ 22-20, 21-10తో ప్రెవైలిడ్ను చిత్తుచేశారు. మహిళల సింగిల్స్ క్లాస్ ఎస్‌యూ5లో జెహ్రాపై కోహ్లీ విజయం సాధించగా, మహిళల డబుల్స్‌లో 19ఏళ్ల కోహ్లీ, పారుల్ పర్మార్ జంట సెకండ్ సీడ్ చైనీస్ జంట చెంగ్ హెఫాంగ్, మా హుయిహుయి చేతిలో ఓటమి పాలైంది. ఈ పారాలింపిక్స్నుంచే బ్యాడ్మింటన్ పోటీలకు అవకాశం దక్కింది.
షాట్‌పుట్‌లో ఆరవింద్‌కు 7వ స్థానం
షాట్‌పుట్ ఎఫ్35 పురుషుల విభాగం ఫైనల్‌కు చేరి పతకంపై ఆశలు రేపిన భారత్‌కు చెందిన అరవింద స్వామి ఫైనల్లో నిరాశపరిచాడు. గురువారం జరిగిన ఫైనల్లో అరవింద్ ఆరు ప్రయత్నాల్లో ఉత్తమంగా 13.48మీ. మాత్రమే విసరగలిగాడు. ఫైనల్‌కు చేరిన 8మందిలో అరవింద్ మాలిక్ 6వ ప్రయత్నంలో ఈ ఫీట్‌ను అందుకున్నాడు. 2వ ప్రయత్నంలో 12.41మీ., 4వ ప్రయత్నంలో 11.87మీ. గుండును విసిరాడు.