Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ బాలికల హ్యాండ్బాల్ పోటీలు
లక్నో : జాతీయ బాలికల జూనియర్ హ్యాండ్బాల్ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో అస్సోంపై 14-4తో తెలంగాణ ఘన విజయం సాధించింది. జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీలు బుధవారం లక్నోలో ఆరంభం అయ్యాయి. జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్మోహన్ రావు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆర్.కె తివారీ పోటీలను ప్రారంభించారు. 'స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా సహకారంతో మంచి వాతావరణంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నాం. కోవిడ్-19తో స్తంభించిన నేషనల్స్ను అన్ని జాగ్రత్తలతో జరుపుతున్నాం. ఈ టోర్నీలో 24 జట్లు, అండర్-19 విభాగంలో సుమారు 600 మంది క్రీడాకారిణీలు పాల్గొనటం ఆనందదాయకం' అని జగన్మోహన్ రావు తెలిపారు.