Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యోగ వేటలో పారాలింపిక్ స్టార్ నిషద్ కుమార్
చంఢగీడ్ : ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని ప్రేమ చూపించటం చూస్తూనే ఉన్నాము. పారాలింపిక్స్‌లో పతకాల పంట పండించిన అథ్లెట్లలో కొందరు ఏదైనా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. టోక్యో 2020 పారాలింపిక్స్ హైజంప్ (టీ47)లో సిల్వర్ మెడల్ సాధించిన నిషద్ కుమార్ కొలువు కోసం నిరీక్షిస్తున్నాడు. నగదు ప్రోత్సాహకాలు, సన్మానాలు కాదు ఉద్యోగ భద్రత కావాలని ఆశిస్తున్నాడు. ' ఉద్యోగం జీవిత భద్రత కల్పిస్తుంది. అథ్లెట్ల జీవిత కాలం స్వల్పకాలమే. మరో పదేండ్లు క్రీడల్లో ఉంటాం. నగదు బహుమతి, ఇతర వాటి కంటే ఎక్కువగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నాను. ఇంకా మా నాన్న తాపీ పని చేయాలని నేను కోరుకోవటం లేదు. గత 2-3 ఏండ్లుగా ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. ఉద్యోగం భద్రత కల్పిస్తుంది, స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్స్ కాంస్యంతో కేంద్ర ప్రభుత్వం రూ.8 లక్షల నజరానా అందించింది. కానీ ఉద్యోగం ప్రకటించలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరూ ఉద్యోగ ప్రస్తావన చేయలేదు. ఈ పారాలింపిక్స్ పతకమైనా నాకు ఉద్యోగం తెచ్చి పెడుతుందని ఆశిస్తున్నాను' అని నిషద్ కుమార్ అన్నాడు.