Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెంటార్‌గా ధోనీ పాత్రపై గంభీర్, చౌదరి
న్యూఢిల్లీ : 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌కు భారత మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఎం.ఎస్ ధోని టీమ్ ఇండియా సలహాదారుగా (మెంటార్)గా రానుండటంపై క్రికెట్ వర్గాల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఎం.ఎస్ ధోనీ విలువైన సేవలు జట్టుకు ఉపయుక్తంగా ఉంటాయనే ఆలోచనతో బీసీసీఐ ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జట్టు మేనేజ్మెంట్ సైతం ధోనీ రాక పట్ల సానుకూలంగా ఉంది. బీసీసీఐ మాజీ కోశాధికారి అనిరుధ్ చౌదరి, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్‌లు మెంటార్‌గా ధోనీ రాకపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఒత్తిడిని జయించేందుకే! : 'ప్రపంచకప్ జట్టులో ఎం.ఎస్ ధోని పాత్ర పరిమితం అనుకుంటున్నాను. చీఫ్ కోచ్, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్.. ఇలా అందరూ అందుబాటులో ఉన్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు ధోనీ నుంచి ప్రత్యేకంగా ఏదో ఆశిస్తున్నారు. టీ20 ఫార్మాట్లో భారత్ సక్సెస్ఫుల్ జట్టు. నైపుణ్యం పరంగా ఆటగాళ్లపై ధోనీ ప్రభావం ఉండదు. అందుకు తగిన యంత్రాంగం జట్టుకు ఉంది. అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి పరిస్థితులను ఎదుర్కొన్న ఎం.ఎస్ ధోని అనుభవం యువ క్రికెటర్లకు అవసరం. ప్రత్యేకించి నాకౌట్ మ్యాచుల్లో ఒత్తిడిని జయించటంపై ధోనీ అనుభవం, మార్గదర్శనం కుర్రాళ్లకు అవసరం. ఎనలేని ఒత్తిడిలో జట్టును నడిపించిన ఎం.ఎస్ ధోనీ అనుభవం యువ క్రికెటర్లకు ఉపయుక్తంగా ఉంటుంది. బహుశా, ఒత్తిడిని జయించటంపై కుర్రాళ్లకు మార్గం చూపిస్తాడనే అంశంపైనే ధోనీని మెంటార్‌గా తీసుకుని ఉంటారు' అని గౌతం గంభీర్ అన్నాడు.
ఆ నలుగురు అద్వితీయం : ' మెంటార్‌గా ధోనీని తిరిగి జట్టులోకి తీసుకోవటం తిరుగులేని నిర్ణయం. ఎం.ఎస్ ధోని, రవిశాస్త్రి, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అత్యంత శక్తివంతమైన నాయకత్వ బృందంగా ఏర్పడగలరు. ఈ నాయకత్వ బృందం నిర్ణయాలు భారత్ టీ20 ప్రపంచకప్ విజయాన్ని మరింత పెంచగలదు. మెంటార్‌గా ధోనీ ఎంపికపై బీసీసీఐ కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా అభినందించాలి' అని బీసీసీఐ మాజీ కోశాధికారి అనిరుధ్ చౌదరి అన్నాడు.