Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చిక్కుల్లో పడ్డాడు. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించే మహీ.. గతంలో ఆమ్రపాలి హౌజింగ్ ప్రాజెక్టుకూ అంబాసిడర్‌గా వ్యవహరించి కొన్ని ప్లాట్లను కొనుగోలు చేశాడు. ఆ ప్లాట్ల బకాయిల్ని చెల్లించని వారిలో ధోనీ ఒకడు. తాజాగా ఈ వివాదం మరోసారి తెర మీదకు రావడం, సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం ప్లాట్లకు బకాయిల్ని చెల్లించని వారిలోపాటు ధోనీకి నోటీసులు జారీచేసి 15 రోజుల డెడ్‌లైన్ విధించింది. లేనిపక్షంలో ఒప్పందం రద్దు కావడంతో పాటు ప్లాట్లను వేలం వేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రస్తుతం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఎన్బిసిసి.. ఈ మేరకు ధోనీతో పాటు మొత్తం 1,800 మందికి నోటీసులు జారీ చేసింది. ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌కు 2009 నుంచి 2016 వరకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించగా.. ధోనీతో పాటు పలువురు క్రికెటర్లకు 37 కోట్ల రూపాయల్ని చెల్లించినట్లు రోహిత్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ఇప్పటికే వెల్లడించింది.