Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యుఏఇ బయల్దేరిన ఆటగాళ్లు
- అబుదాబి చేరిన రోహిత్, బుమ్రా, సూర్యకుమార్
- ఆటగాళ్ల చేరవేతకు ఫ్రాంచైజీలు ఛార్టర్డ్ ఫ్లైట్స్ ఏర్పాటు
లండన్: భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదో, చివరి టెస్ట్ రద్దు కావడంతో ఐపిఎల్ ఆడేందుకు ఆడేందుకు ఆటగాళ్లు ఒక్కొక్కరిగా యుఏఇకి బయల్దేరుతున్నారు. శనివారం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు, జస్ప్రీత్ బుమ్రా, సూర్య కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి అబుదాబి ప్రత్యేక విమానంలో అబుదాబి చేరుకున్నారు. వీరందరికీ ఆరురోజుల క్వారంటైన్ తప్పనిసరి. ఇంగ్లండ్ నుంచి బయల్దేరడానికి ముందు వీరందరికీ జరిపిన కోవిడ్-19 పరీక్షల్లో నెగెటివ్ రావడంతో మాంచెస్టర్ నుంచి నేరుగా అబుదాబికి చేరుకున్నారు. ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ ట్విటర్ వేదికగా రోహిత్, భార్య రితిత అబుదాబి చేరిన ఫొటోలను షేర్ చేసింది. 'కెప్టెన్ ఆల రే! స్వాగతం రో, రితికా, సామీ' అంటూ.. అబుదాబిలో బూమ్ గంట మోగింది స్వాగతం జేబీ మరియు సంజ్' అంటూ ముంబయి ఇండియన్స్ ట్వీట్ చేసింది. ఇక చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాళ్లు మరికొందరు శనివారం దుబారుకి చేరుకున్నారు. ఛటేశ్వర పుజారా కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఇంగ్లండ్ నుంచి దుబారు చేరుకున్నారని ఆ ఫ్రాంచైజీ సిఇవో కాశీ విశ్వనాథన్ ఓ ప్రకటనలో తెలిపారు. అన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లను త్వరగా యుఏఇకి చేరవేస్తే క్వారంటైన్ కాలం కలిసి వస్తుందని భావిస్తున్నాయి. సెప్టెంబర్ 19నుంచి యుఏఇ వేదికగా ఐపిఎల్ సీజన్-14 మిగిలిన మ్యాచ్‌లు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
ఐపిఎల్‌కు బెయిర్‌స్టో, మలాన్, వుడ్స్ దూరం..
సన్‌రైజర్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలకు ఎదురుదెబ్బ తగలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంస ఓపెనర్ బెయిర్‌స్టో, పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ ఈ సీజన్ ఐపిఎల్‌కు దూరమయ్యారు. వ్యక్తిగత కారణాలతో మిగిలిన ఐపిఎల్ మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయా ఫ్రాంచైజీలకు తెలిపారు. వీరు మాంచెస్టర్ వేదికగా జరిగే ఐదో టెస్ట్ ఆడాల్సి ఉంది. వచ్చే నెలలో టి20 ప్రపంచకప్, అనంతరం యాషెస్ సిరీస్ నేపథ్యంలో కుటుంబ సభ్యులతో కొంతకాలం గడిపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.