Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ఐదోటెస్ట్ రద్దుపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఇసిబి) ఐసిసికి ఆదివారం లేఖ రాసింది. నిర్ణయాత్మక టెస్ట్ కోవిడ్ కారణంగా రద్దవ్వడం, ఆఖరి క్షణాల్లో భారతజట్టు మైదానంలో దిగడానికి సుముఖంగా లేనని ప్రకటించడం, టెస్ట్ ఫలితం తదితర అంశాలను ఇసిబి ఆ లేఖలో పేర్కొంది. కోవిడ్ కారణంగా ఈ మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ఐసిసి ప్రకటిస్తే.. ఇన్సూరెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటామని ఇసిబి తెలిపింది. ఈ మ్యాచ్ రద్దు కారణంగా 4కోట్ల పౌండ్లు నష్టపోయినట్లు ఆ లేఖలో పేర్కొంది. కోవిడ్ కారణంగా మ్యాచ్ బరిలోకి నిరాకరించడాన్ని ఐసిసి అనుమతించింది. ఐదో టెస్ట్‌కు ముందు భారత ఆటగాళ్లకు జరిపిన రెండు ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో నెగటివ్‌గా తేలినా.. ఆడకపోవడాన్ని ఇంగ్లండ్ క్రికెట్‌బోర్డు ప్రధానంగా లేవనెత్తుతోంది. ఒకవేళ ఐసిసి ఈ మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటిస్తే.. భారత్ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.