Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రాజా రణధీర్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అధ్యక్షులు, కువైట్ రాజ కుటుంబ సభ్యులు షేక్ అహ్మద్ అల్-ఫవాద్ అల్-సబాకు ఒక రాజకీయ కుట్రలో జెనీవా కోర్టు శుక్రవారం జైలుశిక్ష విధించింది. దీంతో అతను ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్నారు. ఈ నేపధ్యంలో 74ఏళ్ల సింగ్ తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించారు. తాను తాత్కాలిక అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించానని, షేక్ అహ్మద్ కేసు నుంచి విజయవంతంగా బయటకు వస్తారనే అశాభావాన్ని రాజా రణధీర్ సింగ్ సోషల్ మీడియాలో వ్యక్తం చేశారు. మాజీ ఒలింపిక్ షూటర్ అయిన సింగ్ 2015 వరకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలో ఎగ్జిక్యూటీవ్ సభ్యునిగా ఉన్నారు. 2010 కామన్వెల్త్ గేమ్స్ వంటి క్రీడా వేడుకలు భారత్లో జరగడంలో ఆయన కీలక పాత్ర వహించారు. కాగా, చైనాలో 2022 ఫిబ్రవరిలో వింటర్ ఒలింపిక్స్ జరుగనుండగా. చైనాలోనే హంగ్జోవో నగరంలో 2022 సెప్టెంబరు 10 నుంచి 19వ ఆసియా గేమ్స్ నిర్వహించనున్నారు.