Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొలంబో: అక్టోబర్ 17నుంచి యుఏఇ వేదికగా జరగనున్న ఐసిసి టి20 ప్రపంచకప్‌కు శ్రీలంక క్రికెట్‌బోర్డు 15మందితో కూడిన జట్టును ప్రకటించింది. 2014 టి20 ప్రపంచ చాంపియన్స్ అయిన శ్రీలంక ఈసారి నేరుగా అర్హత సాధించలేకపోయింది. దీంతో తొలుత అర్హత టోర్నీలో పాల్గొనాల్సి ఉంది. అందులో విజయం సాధిస్తేనే సూపర్-12కు అర్హత సాధిస్తుంది. అర్హత టోర్నీ గ్రూప్-ఎలో శ్రీలంకతోపాటు నమీబియా, నెదర్లాండ్స్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి. శ్రీలంక ఇటీవల ఆడిన 5 టి20 సిరీస్‌లలో భారత్-బి జట్టుపై ఒక్క సిరీస్ మాత్రమే నెగ్గింది. దాసన్ శనకకు జట్టు పగ్గాలు దక్కగా.. ధనుంజయకు వైస్ కెప్టెన్సీ లభించింది. ఇక టి20 ప్రపంచకప్ అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు జరగనుంది.
జట్టు: దాసన్ షనక(కెప్టెన్), ధనుంజయ(వైస్ కెప్టెన్), కుశాల్ జనిత్ పెరీరా, చండీమల్, అవిష్క ఫెర్నాండో, రాజపక్స, అసలంక, హసరంగ, మెండిస్, కరుణరత్నె, ప్రదీప్, చమీర, జయవిక్రమ, మధుషంక, మహీష్ తీక్షణ.
రిజర్వు ఆటగాళ్లు: లహిరు కుమార, బినుర ఫెర్నాండో, అకిల దనంజయ, పులిన తరంగ.