Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్‌తో క్రికెట్‌పై రమీజ్ రాజా
లాహోర్ : భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు ఇప్పట్లో అసాధ్యమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నూతన చైర్మన్ రమీజ్ రాజా తెలిపాడు. పాక్ ప్రధాని, మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుతో రమీజ్ రాజా ఏకగ్రీవంగా పీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యాడు. సోమవారం పీసీబీ చైర్మన్‌గా బాధ్యతలు అందుకున్న రమీజ్ రాజా భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలపై స్పందించాడు. ' క్రీడలను రాజకీయాలు ప్రభావితం చేస్తున్నాయి. ప్రస్తుతానికి భారత్, పాకిస్థాన్ ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు అసాధ్యం. ఈ విషయంలో ఎటువంటి తొందర అవసరం లేదు. పీసీబీ చైర్మన్‌గా నా తక్షణ కర్తవ్యం.. దేశవాళీ, స్థానిక క్రికెట్ అభివృద్ది. దేశీయంగా మౌళిక సదుపాయాల కల్పన, నాణ్యమైన కోచింగ్ వ్యవస్థ ఏర్పాటు దిశగా నిర్మాణాత్మక అడుగులు వేయనున్నాం. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఎన్నో అంశాలు పరిశీలించి.. నాకు ఈ బాధ్యతలు అప్పగించారు' అని రమీజ్ రాజా తెలిపాడు.