Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీలపై బీసీసీఐ
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కొత్తగా రానున్న రెండు ప్రాంఛైజీలకు ఈ-బిడ్డింగ్ ప్రక్రియకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ముహుర్తం ఖరారు చేసింది. ఇన్విటేషన్ టు టెండరు పత్రాలను కొనుగోలు చేసేందుకు అక్టోబర్ 5ను తుది గడువుగా విధించిన బీసీసీఐ.. అక్టోబర్ 17న ఈ బిడ్డింగ్‌కు ఏర్పాట్లు చేస్తోంది. కొత్త ప్రాంఛైజీల రేసులో అహ్మదాబాద్, లక్నో, పుణె, గువహటి నగరాలు ముందున్నాయి. నూతన ప్రాంఛైజీల ద్వారా బీసీసీఐ రూ. 7 వేల కోట్ల ఆదాయం ఆశిస్తోంది. ఒక్కో ప్రాంఛైజీకి రూ.3000-3500 కోట్ల ధర ఆశిస్తోంది. అదానీ గ్రూప్, ఫార్మా కంపెనీ టోరెంటో, హర్ష గోయెంకా గ్రూపులు కొత్త ప్రాంఛైజీల కోసం పోటీపడనున్నాయి. ఓ దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ సైతం ఐపీఎల్ ప్రాంఛైజీపై కన్నేసినట్టు తెలుస్తోంది.