Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌పై గెలుపు
- ఫిడె ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్
న్యూఢిల్లీ : డిఫెండింగ్ చాంపియన్ (సంయుక్త) భారత్ సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఫిడె ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్‌లో టీమ్ ఇండియా దూసుకెళ్తోంది. ఉక్రెయిన్‌తో క్వార్టర్ఫైనల్లో గెలుపొందిన భారత్.. బుధవారం అమెరికాతో తలపడనుంది. తొలి సెమీస్‌లో భారత్, అమెరికా పోటీపడనుండగా.. రెండో సెమీఫైనల్లో మరో సంయుక్త చాంపియన్ రష్యాతో చైనా ఢకొీట్టనుంది. ఉక్రెయిన్‌తో మ్యాచ్‌లో భారత్ ఉత్కంఠ విజయం నమోదు చేసింది. టాప్-2 బోర్డు మ్యాచుల్లో గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్, గ్రాండ్‌మాస్టర్ పి. హరికృష్ణలు తమ మ్యాచులను డ్రా చేసుకున్నారు. మహిళల విభాగంలో గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపీ, ఆర్. వైశాలి మ్యాచులు సైతం డ్రాగా ముగిశాయి. నిహాల్ జూనియర్ బోర్డుపై విజయం సాధించగా, ద్రోణవల్లి హరిక విజయం సాధించింది. దీంతో 4-2తో భారత్ విజయం సాధించింది. తొలి రౌండ్లో ఉక్రెయిన్ 3.5-2.5తో పైచేయి సాధించగా.. రెండో రౌండ్లో భారత్ 5-1తో ఘన విజయం సాధించింది. గ్రాండ్‌మాస్టర్ బి. ఆదిబన్ 36 ఎత్తుల్లోనే కిరిల్‌పై మెరుపు విజయం నమోదు చేశాడు. నేడు రాత్రి 9 గంటల నుంచి అమెరికా, భారత్ సెమీఫైనల్స్ జరుగుతాయి. ప్రేగ్ (చెక్ రిపబ్లిక్) నుంచి పి. హరికృష్ణ, విశాఖ నుంచి కోనేరు హంపీ, హైదరాబాద్ నుంచి ద్రోణవల్లి హరికలు ఫిడె ఆన్లైన్ చెస్ ఒలింపియాడ్ సెమీఫైనల్లో పోటీ పడనున్నారు.