Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేసులో భువనేశ్వర్, లక్నో, గువహటి
- నవంబర్‌లో జూనియర్ మెన్స్ హాకీ వరల్డ్‌కప్
న్యూఢిల్లీ : జూనియర్ మెన్స్ హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్య నగరాన్ని ఎంపిక చేయటంలో హాకీ ఇండియా తాత్సారం చేస్తోంది. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 5 వరకు భారత్ వేదికగా జూనియర్ హాకీ ప్రపంచకప్ జరగాల్సి ఉంది. మహిళల జూనియర్ హాకీ ప్రపంచకప్‌కు దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇవ్వనుంది. దక్షిణాఫ్రికా ఇప్పటికే ఆతిథ్య నగరాన్ని ఎంపిక చేయగా.. హాకీ ఇండియా మాత్రం ఆలస్యం చేస్తోంది. 2016లో లక్నో వేదికగా జరిగిన జూనియర్ ప్రపంచకప్‌ను భారత్ గెల్చుకుంది. ఈ ఏడాది ఈ మెగా టోర్నీకి గువహటి ఆతిథ్యం ఇస్తుందనే ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆతిథ్య రేసులోకి లక్నో, భువనేశ్వర్ నగరాలు వచ్చాయి. 2023 హాకీ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న ఒడిశా ప్రభుత్వం.. తాజాగా జూనియర్ హాకీ ప్రపంచకప్‌కు సైతం ఆతిథ్యం ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. ' హాకీ మెన్స్ జూనియర్ ప్రపంచకప్ వేదిక ఇంకా ఖరారు కాలేదు. హాకీ ఇండియాతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాం. త్వరలోనే దీనిపై స్పష్టత వస్తుంది' అని అంతర్జాతీయ హాకీ ఫెడరేషన్ ప్రతినిధి వెల్లడించారు. కోవిడ్-19 పరిస్థితులు, స్థానికంగా నెలకొన్న నిబంధనల కారణంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు జూనియర్ హాకీ ప్రపంచకప్‌లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది.