Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాక్సిన్ తీసుకుంటేనే స్టేడియంలోకి ఎంట్రీ!
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం లభించింది. కరోనా కారణంగా ఐపీఎల్‌ను టెలివిజన్‌లో చూస్తున్న క్రికెట్ ప్రియులు.. ఐపీఎల్ 2021 కొనసాగింపు సీజన్‌ను స్టేడియాల్లో చూడవచ్చు. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు బుధవారం ప్రకటించారు. ఐపీఎల్ 2021 ద్వితీయార్థం సీజన్ యుఏఈలోని దుబారు, అబుదాబి, షార్జా నగరాల్లో జరుగనుంది. యుఏఈ ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిమిత సంఖ్యలోనే ఐపీఎల్‌కు అభిమానులను అనుమతించనున్నారు. ఈ మేరకు ఐపీఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమంగ్ ఆమీన్ తొలుత ప్రాంఛైజీలకు సమాచారం ఇచ్చారు. కరోనా ప్రభావంతో 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను బీసీసీఐ యుఏఈలో నిర్వహిస్తోంది. పొట్టి ప్రపంచకప్‌కు ప్రేక్షకులను అనుమతించేందుకు రిహార్సల్‌గా తొలుత ఐపీఎల్‌లోనే ప్రవేశం కల్పిస్తున్నారు. స్టేడియం సామర్థ్యంలో ఎంత శాతం మేరకు అభిమానులను అనుమతిస్తారనే విషయంలో నిర్వాహకులు స్పష్టత ఇవ్వలేదు. సెప్టెంబర్ 19న ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 సీజన్ పున ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 16 నుంచి ఐపీఎల్ టిక్కెట్లు అభిమానులకు అందుబాటులో ఉంచనున్నారు. యుఏఈలో అధిక శాతం ప్రజలు కోవిడ్-19 టీకా తీసుకోవటంతో అభిమానులను అనుమతించేందుకు బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారినే ఐపీఎల్ మ్యాచులకు అనుమతించే అవకాశం కనిపిస్తోంది.