Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వన్డే సిరీస్ 2022కు రీ షెడ్యూల్
వెల్లింగ్టన్ : కోవిడ్-19 పరిస్థితు లు, బిజీ షెడ్యూల్ కారణంగా భారత జట్టు న్యూజిలాండ్ పర్యటన వాయిదా పడింది. ఈ ఏడాది ఆఖరులో కోహ్లిసేన మూడు వన్డేల సిరీస్ కోసం న్యూజిలాండ్‌లో పర్యటించాల్సి ఉంది. వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా ఈ వన్డే సిరీస్ షెడ్యూల్ చేశారు. మూడు వన్డేల సిరీస్‌కు ముందు భారత జట్టు న్యూజిలాండ్‌లో 14 రోజులు క్వార ంటైన్లో గడపాల్సి ఉంటుంది. ఈ నేప థ్యంలో భారత్, న్యూజిలాండ్ వన్డే సిరీస్‌ను 2022కు వాయిదా వేస్తు న్నట్టు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ఆస్ట్రేలి యా) అనంతరం భారత జట్టు నేరుగా న్యూజిలాండ్‌కు బయల్దేర నుంది. 2022 వేసవి సీజన్లో బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా లకు కివీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది మార్చి- ఏప్రిల్‌లో మహిళల వన్డే వరల్డ్‌కప్ సైతం న్యూజిలాండ్‌లోనే జరుగనుంది. ఈ ఏడాది నవంబర్‌లో భారత్‌లో న్యూజి లాండ్ పర్యటన యథాతథంగా ఉండనుంది. భారత పర్యటనలో భాగంగా న్యూజిలాండ్ రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ అధికారి ప్రతినిధి తెలిపారు.