Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (హెచ్ఎఫ్ఐ)లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా పరిశీలించిన ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్య (ఏహెచ్ఎఫ్) కీలక నిర్ణయం తీసుకుంది. అసమ్మతి ఆఫీస్ బేరర్లు ప్రధాన కార్యదర్శి ప్రీత్‌పాల్ సింగ్ సలూజ, ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ బాలముచిలను తొలగిస్తూ జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ అత్యవసర ఏజీఎంలో తీసుకున్న నిర్ణయాన్ని ఏహెచ్ఎఫ్ ఆమోదించింది. ఈ మేరకు తమ అధికారిక వెబ్సైట్లో హెచ్ఎఫ్ఐ అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావును ప్రకటించి.. కార్యదర్శి, ఉపాధ్యక్షులు సలూజ, బాలముచి వివరాలను తొలగించింది. భారత హ్యాండ్‌బాల్ ఫెడరేషన్‌లోని అంతర్గత రాజకీయాలను అర్థం చేసుకుని తనకు మద్దతుగా నిలిచిన ఆసియా హ్యాండ్‌బాల్ సమాఖ్యకు అధ్యక్షుడు జగన్ కృతజ్ఞతలు తెలిపారు. 44వ జాతీయ జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా నిర్వహించిన హెచ్‌ఎఫ్‌ఐను అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ సమాఖ్య అభినందించింది.