Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : తమిళనాడు మాజీ కెప్టెన్ శరత్ శ్రీధరన్ బీసీసీఐ జూనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్గా నియమితులయ్యాడు. తమిళనాడు తరఫున 100 రంజీ మ్యాచులు ఆడిన తొలి క్రికెటర్గా నిలిచిన శరత్ 139 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 51.17 సగటుతో 27 శతకాలు, 42 అర్థ సెంచరీలతో 8700 పరుగులు సాధించాడు. పాఠక్ పటేల్ (వెస్ట్ జోన్), రణదెబ్ బోస్ (ఈస్ట్ జోన్), కిషన్ మోహన్ (నార్త్ జోన్), హర్విందర్ సింగ్ సోధి (సెంట్రల్ జోన్) సెలక్షన్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.