Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోటీచేయనున్న స్టార్ బాక్సర్
న్యూఢిల్లీ : ఫిలిప్పీన్స్ దిగ్గజ బాక్సర్, సెనెటర్ మానీ పకియావో వచ్చే ఏడాది దేశాధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నాడు. ఆదివారం జరిగిన పీడీపీ-లేబన్ పార్టీ జాతీయ కన్వెన్షన్లో ఆ పార్టీ తరఫున అధ్యక్షుడిగా నిలబడేందుకు పకియావో నామినేషన్ స్వీకరించి ప్రతిజ్ఞ చేశారు. ' నేను పోరాట యోధుడిని. బాక్సింగ్ రింగ్ లోపల, బయటా ఎల్లప్పుడూ ఫైటర్గానే ఉంటాను. ప్రభుత్వ మార్పు కోరుతున్న ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు నేను బరిలోకి దిగుతున్నాను. ప్రజల అందరి మద్దతు కోరుతున్నాను' అని 42 ఏండ్ల మానీ పకియావో అన్నాడు.