Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రివర్స్ రబ్బర్‌లో ఓదార్పు విజయం
- డెవిస్ కప్ వరల్డ్ గ్రూప్ 1 పోరు
న్యూఢిల్లీ : డెవిస్ కప్‌లో టీమ్ ఇండియాకు భంగపాటు. ప్రపంచ గ్రూప్1 పోరులో ఫిన్లాండ్ చేతిలో భారత్‌కు పరాజయం తప్పలేదు. 3-1తో ఫిన్లాండ్ ఎదురులేని విజయం సాధించి ఫైనల్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకోగా.. దారుణ ఓటమితో భారత్ వరల్డ్ గ్రూప్ 1 ప్లేఆఫ్స్‌కు దిగజారింది. తొలి రోజు రెండు సింగిల్స్ మ్యాచుల్లో ఓడిన భారత్.. అక్కడే ఆశలు ఆవిరి చేసుకుంది. తొలి సింగిల్స్‌లో రామ్‌కుమార్ రామనాథన్ పరాజయం పాలవగా.. ప్రజ్నేష్ గున్నేశ్వరన్ రెండో సింగిల్స్‌ను వదిలేశాడు. 2-0తో ఫిన్లాండ్ గెలుపు ఖాయం చేసుకుంది. రెండో రోజు తొలుత డబుల్స్ మ్యాచ్‌లో రోహన్ బోపన్న, రామ్‌కుమార్ రామనాథన్ జోడీ 7-6(7-2), 7-6(7-2)తో పరాజయం పాలైంది. రివర్స్ సింగిల్స్ రబ్బర్‌లో ప్రజ్నేష్ గున్నేశ్వరన్ 6-3, 7-5తో గెలుపొంది భారత్‌కు ఓదార్పు విజయాన్ని అందించాడు. వరల్డ్ గ్రూప్1 పోరులో ఓడిన భారత్.. డెవిస్కప్లో నిలిచేందుకు కొత్త తరం ఆటగాళ్లతో మెరుగైన వ్యూహలతో సిద్ధం కావాలని నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ అన్నాడు.
' తొలి మ్యాచ్‌లోనే రామ్‌కుమార్ రామనాథన్ ఓటమితో భారత్ లయ కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో విజయంతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాలని అనుకున్నాం. తొలి సింగిల్స్‌లో విజయం మ్యాచ్ ఫలితం భిన్నంగా ఉండేలా చేసేది. కానీ ఆ ఓటమి భారత్‌ను వెనక్కి లాగింది. డెవిస్ కప్‌కు భారత్‌కు మెరుగైన ఆటగాళ్లు అవసరం. డబుల్స్‌లోనూ మంచి ఆటగాళ్లుకావాలి. తర్వాతి తరం ఆటగాళ్లపై దృష్టి పెట్టి.. మెరుగైన వ్యూహలతో రావాల్సి ఉంది' అని రోహిత్ తెలిపాడు.