Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి సరికొత్త రికార్డును నెలకొల్పాడు. ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) చరిత్రలో ఒకే జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2008లో ఐపిఎల్ ప్రారంభమైన నాటి నుంచి బెంగళూరు జట్టుకే ప్రాతినిధ్యం వహించిన కోహ్లి.. నేడు కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌తో ఆ మైలురాయికి చేరుకున్నాడు. కోహ్లి తర్వాత ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ధోని(182 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరి తర్వాత సురేశ్ రైనా(చెన్నై తరఫున 172 మ్యాచ్‌లు), కీరన్ పోలార్డ్(ముంబై ఇండియన్స్ తరఫున 172 మ్యాచ్‌లు), రోహిత్ శర్మ(ముంబయి ఇండియన్స్ తరఫున 162 మ్యాచ్‌లు) వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు.