Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు భారత్-ఆస్ట్రేలియా మహిళల తొలి వన్డే
సిడ్నీ: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత మహిళల జట్టు మంగళవారం తొలి వన్డేలో తలపడనుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మకారులో తొలి మ్యాచ్ ఆడనుంది. భారత మహిళల జట్టు వరుస సిరీస్‌లలో భాగంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లలో పరాజయాల్ని చవిచూసింది. ఆ సిరీస్‌లలో భారత బ్యాటర్స్ నిరాశాజనక ప్రదర్శన కొనసాగింది. స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో వన్డే సిరీస్‌లో పరాజయాన్ని చవిచూడడంతో కోచ్ రమేశ్ పవార్ పదవికి ఎసరుపెట్టింది. ఈ క్రమంలో మంగళవారం నుంచి పటిష్ట ఆస్ట్రేలియాతో సుదీర్ఘ సిరీస్‌కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు వరుసగా 22 మ్యాచుల్లో విజయాలను నమోదు చేసుకొని అప్రతిహాత రికార్డుతో దూసుకెళ్తోంది. ఇటీవల ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో స్మృతి మంధాన అర్ధసెంచరీతో రాణించగా... ఓపెనర్ షెఫాలీ వర్మ, కెప్టెన్ మిథాలీరాజ్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల జట్టు మూడేసి వన్డే, టి20 సిరీస్‌లతోపాటు ఏకైక టెస్ట్ మ్యాచ్‌నూ ఆడనుంది.