Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బెంగళూరుపై 9 వికెట్ల తేడాతో గెలుపు
- 92 పరుగులకే కుప్పకూలిన కోహ్లి సేన
- బౌలింగ్‌లో మెరిసిన రస్సెల్, వరుణ్
అబుదాబి: స్టార్ బ్యాట్స్మన్లు ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు మరోసారి స్వల్పస్కోర్‌కే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లు ఆండీ రస్సెల్(9/3), వరణ్ చక్రవర్తి(3/13) దెబ్బకు బెంగళూరు జట్టు 19 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలింది. అనంతరం కోల్‌కతా ఓపెనర్లు శుభ్‌మన్(48), వెంకటేశ్ అయ్యర్(41) రాణించడంతో వికెట్ నష్టపోయి 10ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరుకు రెండో ఓవర్లోనే గట్టి షాక్ తగిలింది. ప్రసిద్ధ్ కష్ణ వేసిన 1.4 ఓవర్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ(5) ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వన్‌డౌన్ బ్యాట్స్‌మన్ శ్రీకర్ భరత్(16)తో కలిసి దేవదత్ పడిక్కల్ ఇన్నింగ్స్‌ని చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో చివరి బంతికి పడిక్కల్ దినేశ్ కార్తీక్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత ఆర్సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. రసెల్ వేసిన తొమ్మిదో ఓవర్లో భరత్(16), డివిలియర్స్(0) ఒకరివెంట మరొకరు పెవీలియన్ చేరారు. ఈ క్రమంలో బెంగళూరు జట్టు పది ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 54 పరుగులు మాత్రమే చేయగల్గింది. వరుణ్ చక్రవర్తి వేసిన 12వ ఓవర్లో మాక్స్వెల్(10), హసరంగ(0) పెవిలియన్ చేరారు. కైల్ జేమీసన్(4), సచిన్ బేబీ(7) కూడా నిరాశపర్చారు. హర్షల్ పటేల్(12) రెండు ఫోర్లు కొట్టి ఫెర్గూసన్ వేసిన 16.3 ఓవర్‌కు క్లీన్ బౌల్డయ్యాడు. సిరాజ్(8)ని రసెల్ ఔట్ చేశాడు. కోత్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, రసెల్ మూడు వికెట్లతో రాణించగా.. ఫెర్గ్యూసన్‌కు రెండు, ప్రసిద్ధ్ కృష్ణకు ఒక వికెట్ దక్కాయి. 93 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా ఓపెనర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. శుభ్‌మన్(48పరుగులు; 34 బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్), వెంకటేశ్(41నాటౌట్; 27 బంతుల్లో 7ఫోర్లు, సిక్సర్) రాణించారు. శుభ్‌మన్ అర్ధసెంచరీకి చేరువలో ఉండగా.. చాహల్ వేసిన బౌంలింగ్లో సిరాజ్ క్యాచ్ అందుకోవడంతో అతడు పెవీలియన్‌కు చేరాడు.
డివిలియర్స్ గోల్డెన్ డక్..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ ఐపిఎల్ చరిత్రలో 6వసారి గోల్డెన్ డక్ అయ్యాడు. సోమవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఏబీ తాను ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు. జట్టు స్కోర్ 51 పరుగుల వద్ద 4వ బ్యాట్స్‌మన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన ఏబీ.. రస్సెల్ వేసిన యార్కర్‌ను ఎదుర్కొనే క్రమంలో బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐపిఎల్ చరిత్రలో డివిలియర్స్ 6వసారి తొలిబంతికే బౌల్డ్ కావడం విశేషం.
స్కోర్‌బోర్డు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: కోహ్లి (ఎల్బి)ప్రసిధ్ 5, పడిక్కల్ (సి)దినేశ్ కార్తీక్ (బి)ఫెర్గ్యూసన్ 22, భరత్ (సి)శుభ్‌మన్ (బి)రస్సెల్ 16, మ్యాక్స్‌వెల్ (బి)చక్రవర్తి 10, డివిలియర్స్ (బి)రస్సెల్ 0, సచిన్ బేబి (సి)నితీశ్ రాణా (బి)చక్రవర్తి 7, హసరంగ (ఎల్బి)చక్రవర్తి 0, జేమీసన్ (రనౌట్) చక్రవర్తి 4, హర్షల్ పటేల్ (బి)షెర్గ్యూసన్ 12, సిరాజ్ (బి)చక్రవర్తి (బి)రస్సెల్ 8, చాహల్ (నాటౌట్) 2, అదనం 6. (19 ఓవర్లలో ఆలౌట్) 92 పరుగులు.
వికెట్ల పతనం: 1/10, 2/41, 3/51, 4/52, 5/53, 6/63, 7/66, 8/76, 9/83, 10/92
బౌలింగ్: వరణ్ చక్రవర్తి 4-0-13-3, ప్రసిధ్ కృష్ణ 4-0-24-1, ఫెర్గ్యూసన్ 4-0-24-2, నరైన్ 4-0-20-0, రస్సెల్ 3-0-9-3.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: శుభ్‌మన్ (సి)సిరాజ్ (బి)చాహల్ 48, వెంకటేశ్ అయ్యర్ (నాటౌట్) 41, రస్సెల్ (నాటౌట్) 0, అదనం 5. (10 ఓవర్లలో వికెట్ నష్టానికి) 94 పరుగులు.
వికెట్ల పతనం: 1/82
బౌలింగ్: సిరాజ్ 2-0-12-0, జేమీసన్ 2-0-26-0, హసరంగ 2-0-20-0, చాహల్ 2-0-23-1, హర్షల్ పటేల్ 2-013-0