Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ ఢ
- రాత్రి 7.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
నవతెలంగాణ-దుబాయ్ : ఎనిమిది మ్యాచుల్లో ఆరు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం. ఏడు మ్యాచుల్లో ఆరు అపజయాలతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. ఐపీఎల్ 2021 ప్రథమార్థం సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రదర్శన ఇది. ఢిల్లీ వరుస విజయాలతో అగ్ర పథాన దూసుకుపోగా.. గెలుపు లేని పోరాటం సన్‌రైజర్స్‌ను నైరాశ్యంలోకి నెట్టింది. ప్లే ఆఫ్స్‌లో చోటుపై కన్నేసి ద్వితీయార్థం సమరానికి ఢిల్లీ సై అంటోంది. గత సీజన్ తరహాలో ఇప్పుడూ యుఏఈ వేదికగా అద్భుత ప్రదర్శనతో టాప్-4లో నిలవాలని హైదరాబాద్ తపిస్తోంది. ఈ రెండు జట్లు నేడు దుబారు స్టేడియంలో ముఖాముఖి రెఢ అవుతున్నాయి.
వార్నర్‌పైనే చూపులు : ప్రథమార్థం సీజన్లో డెవిడ్ వార్నర్ పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు. పరుగులు చేసినా.. స్ట్రయిక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఫలితంగా కెప్టెన్సీతో పాటు తుది జట్టులో చోటు కోల్పోయాడు. హైదరాబాద్‌కు అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్ జానీ బెయిర్‌స్టో ద్వితీయార్థంలో ఆడటం లేదు. దీంతో విదేశీ కోటాలో వార్నర్, కేన్ విలియమ్సన్కు తోడు రషీద్ ఖాన్, విండీస్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ ఆడే అవకాశం కనిపిస్తోంది. తొలి ఏడు మ్యాచుల్లో ఏకంగా 21 మంది ఆటగాళ్లను ఆడించిన హైదరాబాద్ ఇప్పుడు స్వదేశీ ఆటగాళ్ల నుంచి మంచి ప్రదర్శన ఆశిస్తోంది. మనీశ్ పాండే, వృద్దిమాన్ సాహాలు బాధ్యత తీసుకోవాల్సి ఉంది. యార్కర్ల హీరో టి. నటరాజన్ గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి రావటం హైదరాబాద్‌కు ఊరట. భువనేశ్వర్ కుమార్‌తో కలిసి నట్టూ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
యువ వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ కెప్టెన్సీ నిలుపుకున్నాడు. రెగ్యులర్ సారథి శ్రేయాష్ అయ్యర్ జట్టులోకి వచ్చినా.. సారథ్య పగ్గాలు పంత్‌కే ఇచ్చింది ప్రాంఛైజీ యాజమాన్యం. అయ్యర్ రాకతో స్టీవ్ స్మిత్ తుది జట్టులో చోటు కోల్పోనున్నాడు. టాప్ ఆర్డర్లో శిఖర్ ధావన్, పృథ్వీ షా.. లోయర్ ఆర్డర్లో మార్కస్ స్టోయినిస్, పంత్ మెరుపులతో ప్రథమార్థంలో ఢిల్లీ ధనాధన్ జోరు చూపించింది. ప్లే ఆఫ్స్ బెర్త్‌కు రెండు విజయాల దూరంలో ఉన్న ఢిల్లీ.. తొలుత టాప్-4లో చోటు ఖాయం చేసుకోవటంపై దృష్టి సారించనుంది. ఒత్తిడిలో ఉన్న హైదరాబాద్‌తో తొలి మ్యాచ్ క్యాపిటల్స్‌కు కలిసి రానుంది.
తుది జట్లు (అంచనా) :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : డెవిడ్ వార్నర్, వృద్దిమాన్ సాహా (వికెట్ కీపర్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టి.నటరాజన్, సందీప్ శర్మ.
ఢిల్లీ క్యాపిటల్స్ : ప్రథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయాష్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, షిమ్రోన్ హిట్మయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్ట్జె, అవేశ్ ఖాన్.